హాంగ్‌కాంగ్‌ ప్రజాస్వామ్య నేతల అరెస్టు

గతేడాది హాంగ్‌కాంగ్‌లో ప్రజాస్వామ్య నిరసనలకు నాయకత్వం వహించిన ప్రజాస్వామ్య నేతలను పోలీసులు అరెస్టు చేశారు. స్వయంప్రతిపత్తిగల హాంగ్‌కాంగ్‌ చైనాకు నేరస్తుల అప్పగింత చట్టం చేయటంతో దానిని వ్యతిరేకిస్తూ వేలమంది రోడ్లపైకి వచ్చి రోజులతరబడి ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన వెనుక మాజీ చట్టసభ సభ్యులు మార్టిన్‌ లీ, అల్బర్ట్‌ హో,లీ చెక్‌ యాన్‌, ఆ నోక్‌ హిన్‌ ఉన్నారని గతేడాది ఆగస్టు 31న పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ప్రజాస్వామ్య ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం వివాదాస్పద చట్టాన్ని రద్దుచేసింది.