దేశంలో లాక్‌డౌన్ విధించడంతో దేశంలో చిక్కుకుపోయిన సుమారు వెయ్యి మంది విదేశీయులను వారి స్వదేశాలకు పంపించారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐదు విమానాల్లో వీరందరినీ ఈ రోజు ఉదయం పంపించారు. సుమారు 150 మంది జపనీయులతో ఒక విమానం టోక్యోకు బయల్దేరగా, మరో నాలుగు విమానాల్లో 500 మందిని జర్మనీకి, 120 మందిని ఉక్రెయిన్, 240 మందిని రెండు బాల్టిక్ దేశాలకు తరలించారు. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు మరో రెండు విమానాలు 750 మందితో ఫ్రాంక్‌ఫోర్ట్ (జర్మనీ), ఆస్ట్రియాకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లనున్నాయని అధికారులు తెలిపారు.