భారత దేశంలో మానవ సంచారం ఎప్పుడు మొదలైందన్న దానిపై పురావాస్తు శాస్త్రవేత్తలు ఓ క్లారిటీకి వచ్చారు. ఉత్తర భారతంలో ఉన్న సోన్ నది సమీపంలో ఇటీవల పురావాస్తు శాఖ అధికారులు దాబా అనే ప్రాంతం నుంచి కొన్ని రాతి పనిముట్లను సేకరించారు. వాటిని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. ఇక్కడ జరిగిన మానవ సంచారం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. దాదాపు 80వేల ఏళ్ల క్రితమే.. సెంట్రల్ ఇండియాలో మానవులు సంచరించినట్లు అంచనాకు వచ్చారు. కట్టింగ్ కోసం ఆది మానవులు ఈ రాళ్ల పనిముట్లను వాడినట్లు నిర్ధారించారు. మధ్యరాతి యుగంలో నియండర్తల్స్ వాడిన పనిముట్ల తరహాలో రాతిపనిముట్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు ఓ అభిప్రాయానికి వచ్చారు. కానీ అప్పుడు సంచరించిన మానవులు.. నియండర్తల్స్ అవునా కాదా అన్న అంశాన్ని మాత్రం తేల్చలేకపోయారు.
అమరచింత తండాలో మొసలి కలకలం